- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోళ్ల రూమ్‌లోకి వెళ్లిన మహిళ.. గడియ వేసి ఆ పని కానిచ్చేసిన ఓనర్
<p>దిశ, వెబ్‌డెస్క్: కష్టం చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బతుకుతున్న మహిళను బయటతిరక్కుండా చేశాడో ప్రబుద్ధుడు. కోళ్ల ఫారంలో పనిచేస్తున్న మహిళపై కన్నేసిన ఆ కామాంధుడు అదును చూసి అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో కలకలం రేపింది. ఎలా జరిగిందంటే..! మద్దిరాల మండల కేంద్రంలోని ఓ కోళ్ల ఫారంలో బాధిత మహిళ(వివాహిత) పనిచేస్తోంది. గత కొంత కాలంగా ఇదే ఫారంలో కోళ్లకు ఆహారం పెట్టడం, ఇతర పనులను పర్యవేక్షిస్తోంది. ఈ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కష్టం చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బతుకుతున్న మహిళను బయటతిరక్కుండా చేశాడో ప్రబుద్ధుడు. కోళ్ల ఫారంలో పనిచేస్తున్న మహిళపై కన్నేసిన ఆ కామాంధుడు అదును చూసి అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో కలకలం రేపింది.
ఎలా జరిగిందంటే..!
మద్దిరాల మండల కేంద్రంలోని ఓ కోళ్ల ఫారంలో బాధిత మహిళ(వివాహిత) పనిచేస్తోంది. గత కొంత కాలంగా ఇదే ఫారంలో కోళ్లకు ఆహారం పెట్టడం, ఇతర పనులను పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం కూడా బర్డ్‌ఫీడ్ కోసం దాన నిల్వ చేసే రూములోకి వెళ్లింది. ఇది గమనించిన మద్దిరాల గ్రామానికి చెందిన యజమాని శేరి సాకేత్ రెడ్డి ఆమె వెనకాలే రహస్యంగా వెళ్లాడు. సదరు మహిళ రూములోకి వెళ్లగానే గడియ వేశాడు. ఇదే అదునుగా బాధితురాలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన అనంతరం అక్కడి నుంచి వెళ్లిన బాధిత వివాహిత మద్దిరాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






