- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'నాగేశ్వరరావు' … నాగచైతన్య మూవీ
by Shyam |
<p>అక్కినేని నాగచైతన్య… సెలెక్టెడ్ మూవీస్‌తో కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. భార్య సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న చైతన్య…. సాయిపల్లవితో ‘లవ్ స్టోరీ’తో రాబోతున్నాడు. ఈ సినిమాలో చై, సాయిపల్లవిలు డ్యాన్సర్స్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఓ డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు ప్రేమలో పడిపోతారని సమాచారం. ఆ తర్వాత ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలిశారు? అనేదే కథ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే ఈ మూవీలో […]</p>

X
అక్కినేని నాగచైతన్య… సెలెక్టెడ్ మూవీస్‌తో కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. భార్య సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న చైతన్య…. సాయిపల్లవితో ‘లవ్ స్టోరీ’తో రాబోతున్నాడు. ఈ సినిమాలో చై, సాయిపల్లవిలు డ్యాన్సర్స్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఓ డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు ప్రేమలో పడిపోతారని సమాచారం. ఆ తర్వాత ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలిశారు? అనేదే కథ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే ఈ మూవీలో చైతన్య తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నాడట.
ఇదిలా ఉంటే మరో సినిమాకు ఓకే చెప్పాడట అక్కినేని వారసుడు. సినిమాకు తాత పేరు ‘నాగేశ్వరరావు’ పెట్టినట్లు సమాచారం. 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ మధ్యే ‘నాగేశ్వరరావు’ టైటిల్‌ను రిజిస్టర్ చేశారట.
Next Story






