కానిస్టేబుల్స్‌ రిక్రూట్‌మెంట్‌లో సత్తాచాటిన ట్రాన్స్‌జెండర్స్!

by  |
కానిస్టేబుల్స్‌ రిక్రూట్‌మెంట్‌లో సత్తాచాటిన ట్రాన్స్‌జెండర్స్!
X

దిశ, ఫీచర్స్ : ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని దేశ అత్యున్నత న్యాయస్థానం 2014లోనే ‘థర్డ్ జెండర్‌’గా గుర్తించిన సంగతి తెలిసిందే. సాధారణ పౌరుల మాదిరి వారికి కూడా ప్రాథమిక హక్కులుంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశంలోని ట్రాన్స్‌జెండర్లు వివిధ రంగాల్లో రాణిస్తూ, తాము తలచుకుంటే అనుకున్నది సాధించగలుగుతామని నిరూపిస్తున్నారు. తాజాగా చత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్‌లో సత్తా‌ చాటారు. పోటీ పరీక్షలో అర్హత సాధించిన 13 మంది ట్రాన్స్‌జెండర్స్ కానిస్టేబుల్స్‌గా ఎంపికయ్యారు.

చత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ‌.. ఖాళీ పోస్టుల భర్తీకి 2019-20లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాతి పరీక్ష, ఫిజికల్ టెస్టుల అనంతరం సెలక్ట్ అయిన 1,736 మందిలో 289 మంది మహిళలు, 13 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నట్లు చత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్తి ప్రకటించారు. తాము తొలిసారిగా పోలీస్ శాఖలోకి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకుంటున్నామన్న అవస్తి.. సెలక్టెడ్ కానిస్టేబుల్స్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ఇక సెలెక్ట్ అయిన 13 మంది ట్రాన్స్‌జెండర్స్‌ కూడా రాయిపూర్‌ సిటీకి చెందిన వారేనని తెలిపారు. కాగా ఇప్పటివరకు దేశంలో ఇద్దరే ట్రాన్స్‌జెండర్లు.. తమిళనాడులో ఒకరు, రాజస్థాన్‌లో ఒకరు మాత్రమే పోలీస్ డ్యూటీ చేస్తున్నారు.

ఇక ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి పోలీసు శాఖలో అవకాశం కల్పించినందుకు గాను కిన్నర సమాజ్, మిట్వ కమిటీలు చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ధన్యావాదాలు తెలిపాయి. సొసైటీలో గుర్తింపునిచ్చే పోలీస్ జాబ్ తమకు దక్కుతుందని అనుకోలేదని, జాబ్ రావడం ఆనందంగా ఉందని సెలక్టెడ్ ట్రాన్స్‌జెండర్ క్యాండిడేట్ ఒకరు అభిప్రాయపడగా, తన ఆనందానికి హద్దుల్లేవని, తమ జీవితాలను మార్చుకునేందుకు ఇది గొప్ప అవకాశమని మరొకరు తెలిపారు.


Next Story

Most Viewed