- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత
<p>రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి(74) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు.ఈ రోజు ఉదయం రెండు సార్లు హార్ట్ ఎటాక్ రావడంతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రకటించారు. అంతకుముందు మే 9న జోగికి గుండెపోటు రావడంతో రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. కాగా, ఒకే రోజులో రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వైద్యులు చెప్పారు. అనంతరం కొద్ది […]</p>

X
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి(74) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు.ఈ రోజు ఉదయం రెండు సార్లు హార్ట్ ఎటాక్ రావడంతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆయన కుమారుడు అమిత్ జోగి ప్రకటించారు. అంతకుముందు మే 9న జోగికి గుండెపోటు రావడంతో రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. కాగా, ఒకే రోజులో రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వైద్యులు చెప్పారు. అనంతరం కొద్ది సేపటికే అజిత్ జోగి మరణించినట్టు కుమారుడు అమిత్ జోగి ట్విట్టర్ వేదికగా తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా(నవంబర్ 2000 నుంచి నవంబర్ 2003 వరకు)గా అజిత్ జోగి సేవలందించారు.
Next Story






