ఫన్ రైడ్‌గా ‘చలాంగ్ ట్రైలర్’

by  |
ఫన్ రైడ్‌గా ‘చలాంగ్ ట్రైలర్’
X

దిశ, వెబ్‌డెస్క్: వైవిధ్యమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రలను పోషిస్తూ.. బాలీవుడ్‌లో మంచి అవకాశాలను అందుకుంటున్న రాజ్‌కుమార్ రావు లేటెస్ట్ మూవీ ‘చలాంగ్’. హన్సల్ మెహతా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఈ చిత్రంలో బద్ధకస్తుడైన వ్యాయామ ఉపాధ్యాయుడిగా నటించిన రాజ్ కుమార్ రావు.. పిల్లలకు ఆసక్తికరంగా ఏయే విషయాలు నేర్పించాడన్నది ట్రైలర్‌లో చూపించారు. ‘పిల్లలకు ఆటలు నేర్పించేందుకు స్కూల్‌కు వెళ్లవా’ అని రాజ్ కుమార్ రావును తల్లి ప్రశ్నించగా.. ‘ఆటపాటలతో పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు, అందుకే వారికి ఆటలు ఆడిస్తూ టైమ్ వేస్ట్ చేయను’ అంటూ తన బద్ధకాన్ని చూపించాడు దర్శకుడు. ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌లా ఉంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుకు జంటగా నుస్రత్ బరుచా నటించింది. కామెడీతో పాటు సినిమాలో ఓ చిన్న సందేశం కూడా ఉంటుందని దర్శకుడా మెహతా అన్నారు. ఇక రాజ్‌కుమార్ రావు బాల్యం అంతా హర్యానాలోనే గడిచింది. కాగా ఈ చిత్రం కూడా హర్యానాలోనే చిత్రీకరించడం విశేషం. దాంతో ఈ సినిమా తన పాఠశాల రోజులను గుర్తు చేసిందని రాజ్‌కుమార్ రావు అన్నారు. ఈ సినిమా దీపావళి ఎంటర్‌టైనర్‌గా నవంబర్ 13న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

Next Story