- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రి జైశంకర్‌కు చేవెళ్ల ఎంపీ లేఖ
<p>యూకేలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరుతూ లేఖ రాశారు. యూకేలో కరోనా పంజా విసరడంతో అక్కడ ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. భారత్ లో ఉన్న యూకే పౌరులను తిరిగి పంపించడానికి ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి నాలుగు, ముంబై నుంచి రెండు విమానాలను పంపనుంది. అదే విమానాల్లో తిరిగి వచ్చేటప్పుడు భారతీయులను తీసుకురావాలని ఎంపీ […]</p>
యూకేలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరుతూ లేఖ రాశారు. యూకేలో కరోనా పంజా విసరడంతో అక్కడ ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. భారత్ లో ఉన్న యూకే పౌరులను తిరిగి పంపించడానికి ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి నాలుగు, ముంబై నుంచి రెండు విమానాలను పంపనుంది. అదే విమానాల్లో తిరిగి వచ్చేటప్పుడు భారతీయులను తీసుకురావాలని ఎంపీ రంజిత్ రెడ్డి లేఖ ద్వారా కేంద్ర విదేశాంగ మంత్రిని కోరారు. కాగా, యూకేలో 380 మంది భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు, వారిలో తెలంగాణకు చెందినవారు 50 మంది ఉన్నట్లు సమాచారం.

tag;chevella mp, ranjith reddy, letter, foreign minister
Next Story






