- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా చేస్తే మీ అభ్యర్థిని మండలికి పంపుతాం….
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: ఒక్క జిందాల్ కంపెనీ కోసం ఎన్నో గూడాలను,ఎన్నో తండాలను వారి సంస్కృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే మాట్లాడే ఒక్క సన్నాసి అయినా ఉన్నడా ఈ రాష్టంలో అని పాలకుల పై డాక్టర్ చెరుకు సుధాకర్ ధ్వజమెత్తారు. సూర్యాపేట కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి డాక్టర్ చెరుకు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మల్లన్న సాగర్ లాంటి ప్రాంతాల్లో దుర్మార్గంగా ప్రజలను ఈడ్చి పారేస్తుంటే ఒక్కరూ ఎందుకు నోరు […]</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ:
ఒక్క జిందాల్ కంపెనీ కోసం ఎన్నో గూడాలను,ఎన్నో తండాలను వారి సంస్కృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే మాట్లాడే ఒక్క సన్నాసి అయినా ఉన్నడా ఈ రాష్టంలో అని పాలకుల పై డాక్టర్ చెరుకు సుధాకర్ ధ్వజమెత్తారు. సూర్యాపేట కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి డాక్టర్ చెరుకు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మల్లన్న సాగర్ లాంటి ప్రాంతాల్లో దుర్మార్గంగా ప్రజలను ఈడ్చి పారేస్తుంటే ఒక్కరూ ఎందుకు నోరు మెదపటంలేదని అన్నారు. నోరు తెరిచి ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు ఆయన హితవు పలికారు. తక్షణమే లక్ష ఇరవై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని అన్నారు. అలా చేస్తే టీఆర్ఎస్ అభ్యర్థినే ఏకగ్రీవంగా మండలికి పంపుతామని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
Next Story






