బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే

by  |
బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే
X

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈలో ఐపీఎల్ 2020 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ 13 సీజన్‌ పై అభిమానుల ఆదరణ రోజు రోజుకీ పెరుగుతోంది. ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది.

ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని చవి చూసింది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంజాబ్ గట్టి పోటీనిచ్చినా.. సూపర్ ఓవర్‌లో మాత్రం ఢిల్లీ పై చేయి సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

కాగా.. గత రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేసిన గబ్బర్ (శిఖర్ దావన్) ఈ రోజు అయినా తోడ కొడుతాడా లేదో అన్న సందేహం నెలకొంది. క్రీజులో కుదురుకుంటే సెంచరీలను అవలీలగా చేసే శిఖర్ ఆట తీరు పై అభిమానుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. అటు చెన్నై ఓపెనర్ వాట్సాన్ పై ఈ మ్యాచ్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. కీలక ఆటగాళ్ల సామర్థ్యల నడుమ సాగే చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Next Story

Most Viewed