బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. గెలుపెవరిది..?

111

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 14లో నేడు మరో రసవత్తర మ్యాచ్‌ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఈ జట్లకు ఇదే రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ రాజస్థాన్‌పై గెలవగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలైంది. ఇక వరుసగా రెండో మ్యాచ్‌ గెలవాలని కేఎల్ రాహుల్ టీమ్ పట్టుదలతో ఉండగా.. ఐపీఎల్‌లో బోణీ కొట్టి అభిమానులను అలరించేందుకు ధోనీ సమాయత్తం అయ్యాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన CSK బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ దిగే పంజాబ్ ఏ మాత్రం స్కోరు చేస్తుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..