నటి చిత్ర మృతికి కారణం ఇదే..

by  |
నటి చిత్ర మృతికి కారణం ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళ సీరియల్ నటి వి.జె.చిత్ర (28) మృతికి రీజన్ సూసైడేనని తేలింది. ఆమె మృత దేహానికి పోస్ట్ ‌మార్టం చేసిన వైద్యులు ఆత్మహత్యేనని నిర్ధారించినట్లు చెన్నై పోలీసులు చెప్పారు. ఆమె మృతి వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని పేర్కొన్నారు. చిత్ర ముఖంపై రెండు చోట్ల గాయాలుండటంతో ఆమెను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయని, కానీ, పోస్ట్‌మార్టం నివేదిక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొందని వివరించారు.

చిత్ర..ఆత్మహత్యకు ముందు వరకు షూటింగ్‌లో పాల్గొనడం, హోటల్‌లోకి వచ్చి కాబోయే భర్తతో ముచ్చటించడం, అనంతరం బాత్‌రూమ్‌లోకి వెళ్లి విగతజీవిగా మారడం తమిళ సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బుధవారం వేకువ జామున ఆమె ఉరివేసుకుంది. టీవీ సీరియళ్లలో నటిస్తూ ఉన్నత స్థితికి చేరుకున్న చిత్ర మృతి పట్ల టీవీ, సినీ కళాకారులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.



Next Story

Most Viewed