- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్‌లో కెమికల్ సిలిండర్లు పేలి భారీ అగ్నిప్రమాదం..
by Batti.Sumithra |
<p>దిశ, మేడ్చల్ : ముడిచింతలపల్లి మండలం జగ్గనగూడ లోని అలఫమేడ్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అలఫమేడ్ కంపెనీలో షార్ట్ సర్కూట్‌తో శనివారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలోని IP(కెమికల్) సిలిండర్స్ పేలి ప్రమాదం జరిగిందని కంపెనీ వారు భావిస్తున్నారు. అయితే ప్రాణ నష్టం ఏమి జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీగానే ఆస్తి నష్టం వాటిల్లిందని […]</p>

X
దిశ, మేడ్చల్ : ముడిచింతలపల్లి మండలం జగ్గనగూడ లోని అలఫమేడ్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అలఫమేడ్ కంపెనీలో షార్ట్ సర్కూట్‌తో శనివారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీలోని IP(కెమికల్) సిలిండర్స్ పేలి ప్రమాదం జరిగిందని కంపెనీ వారు భావిస్తున్నారు. అయితే ప్రాణ నష్టం ఏమి జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

భారీగానే ఆస్తి నష్టం వాటిల్లిందని కంపెనీ యజమాన్యం అంచనా వేస్తోంది. కొల్తూర్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టినా మంటలు అదుపులోకి రాలేదు. సర్పంచ్ విష్ణువర్ధనరెడ్డి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలఫమేడ్ ప్రధాన అంతస్తుతో సహా ఇతర బ్లాక్ లు మంటలు వ్యాప్తించాయి. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






