- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిషేక్‌కు లండన్ ఫుట్‌బాల్ క్లబ్ బెస్ట్ విషెస్
<p>బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా మహమ్మారితో పోరాడుతూ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో వీరిద్దరూ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా, ఓ పోస్ట్ తనకు చాలా కిక్ ఇచ్చిందని.. పాజిటివ్ ఎనర్జీని నింపిందని పోస్ట్ పెట్టాడు అభిషేక్ బచ్చన్. జూనియర్ బచ్చన్‌కు ఫుట్‌బాల్ అంటే ఎంతిష్టమో అభిమానులకు తెలుసు. లండన్‌లోని ‘చెల్సీ ఫుట్‌బాల్ క్లబ్’కు తను వీరాభిమాని […]</p>

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా మహమ్మారితో పోరాడుతూ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో వీరిద్దరూ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా, ఓ పోస్ట్ తనకు చాలా కిక్ ఇచ్చిందని.. పాజిటివ్ ఎనర్జీని నింపిందని పోస్ట్ పెట్టాడు అభిషేక్ బచ్చన్.
జూనియర్ బచ్చన్‌కు ఫుట్‌బాల్ అంటే ఎంతిష్టమో అభిమానులకు తెలుసు. లండన్‌లోని ‘చెల్సీ ఫుట్‌బాల్ క్లబ్’కు తను వీరాభిమాని కాగా.. ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. కాగా, కరోనాతో బాధపడుతున్న సమయంలో ఈ ఫుట్‌బాల్ క్లబ్ అందించిన బెస్ట్ విషెస్ తనలో ఎనర్జీని నింపాయని.. తన డేను మరింత బ్రైట్‌గా చేశాయని చెప్పాడు అభిషేక్.
డియర్ అభిషేక్.. ‘ప్రస్తుతం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో చెల్సి ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన అందరం అర్థం చేసుకోగలం. మేమందరం నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్నాం.. మీరు బాగుండాలని కోరుకుంటున్నట్టు తెలిపేందుకు ఈ లెటర్ రాస్తున్నట్లు’ తెలిపారు. క్లబ్ తరపున బెస్ట్ విషెస్ అందిస్తూ.. కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.






