పోలీసుల తనిఖీలు

150

దిశ, మహబూబ్‌నగర్: సాధారణ తనిఖీలలో భాగంగా బుధవారం ఉదయం 7.30 నుంచి 9.30 నిమిషాల వరకు జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసు జాగిలాలతో కూడిన బాంబు నిర్వీర్య పోలీసు బలగాలు తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు తగిన భద్రత కల్పించే క్రమంలో పోలీసు బలగాలు నిరంతరం తమ విధుల్లో ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రిజర్వ్‌ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో జిల్లా కోర్టు, బస్‌స్టాండ్ తదితర ప్రాంతాలలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు.

tags : checks of police, Common, bus stand, court, ri team, morning, mahabubabad