సిల్వర్ స్క్రీన్‌పై మరో యాంకర్.. సుధీర్‌ది సైడ్ క్యారెక్టరేనా?

by  |
సిల్వర్ స్క్రీన్‌పై మరో యాంకర్.. సుధీర్‌ది సైడ్ క్యారెక్టరేనా?
X

దిశ, సినిమా : బుల్లితెరపై సందడి చేసిన యాంకర్లు సుధీర్, ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేడీ యాంకర్ విష్ణు ప్రియ కూడా సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతుంది. సందీప్‌ బొలినేని, విష్ణుప్రియ‌, దీక్షా పంత్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీ ‘చెక్‌మేట్‌’.. సూటిగా సొళ్లు లేకుండా అనే ట్యాగ్‌లైన్‌‌తో వస్తున్న ఈ మూవీ ఈ నెల 11న విడుదల కాబోతుంది. చిన్ని కృష్ణ ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌పై ప్రసాద్ వేలంప‌ల్లి ద‌ర్శక‌నిర్మాత‌గా రూపొందిస్తున్న చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం, కృష్ణ భ‌గ‌వాన్‌, సంపూర్ణేష్‌ బాబు, శ‌క‌ల‌క శంక‌ర్, సుధీర్ కీల‌క పాత్రల్లో కనిపించనున్నారు.

‘గ‌రుడ‌వేగ’ చిత్రానికి ప‌నిచేసిన అంజి ఈ మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేయగా, సాగ‌ర్ మ‌హ‌తి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ద‌ర్శక‌నిర్మాత ప్రసాద్ వేలంప‌ల్లి మాట్లాడుతూ.. మాములుగా ప్రతి ప్రేమ‌క‌థ‌లో వారి కుటుంబీకుల నుంచి స‌మ‌స్యలు ఎదురవుతుంటాయి. కానీ త‌మ ప్రేమ‌కు క్లోజ్ ఫ్రెండ్‌ కారణమైతే జ‌రిగే ప‌రిణామాలేంటి? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రోల్ కోసం విష్ణు ప్రియ‌ను సెల‌క్ట్ చేశామని, త‌న ఫ్రెండ్‌గా దీక్షా పంత్ న‌టిస్తోందని చెప్పారు.

Next Story

Most Viewed