ప్రభాస్ దయతోనే క్షేమంగా ఉన్నా : శేఖర్

by  |
ప్రభాస్ దయతోనే క్షేమంగా ఉన్నా : శేఖర్
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్టర్ శేఖర్… కాదు కాదు ఛత్రపతి శేఖర్… ఇలా అయితే అందరూ గుర్తుపట్టగలరు. అప్పటి వరకు సీరియళ్లలో కనిపించిన యాక్టర్ .. ‘ఛత్రపతి’ సినిమాలో అవకాశం దక్కించుకుని ఛత్రపతి శేఖర్ అయిపోయాడు. హీరో ప్రభాస్ స్నేహితుడిగా చేసిన ఆ పాత్రకు అంత గుర్తింపు దక్కింది మరి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత దాదాపు అన్ని జక్కన్న సినిమాల్లోనూ మంచి పాత్రలు దక్కించుకుంటున్నాడు శేఖర్.

అయితే ‘ఛత్రపతి’ షూటింగ్ టైంలో జరిగిన ప్రమాదంలో తాను చనిపోయేవాడినని… ప్రభాస్ వల్లే బతికిపోయానని తెలిపాడు శేఖర్. షూటింగ్ సముద్రంలో జరుగుతండగా… హఠాత్తుగా షిప్పులో నుంచి జారిపడిపోయారట శేఖర్. దీంతో వెంటనే ప్రభాస్ అతన్ని గట్టిగా పట్టుకున్నాడట. లేదంటే షిప్పు కింద ఉండే ఫ్యాన్ వైపు వెళ్లిపోయేవాడినని చెప్పాడు. ఆ టైంలో ప్రభాస్ ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే… ఊపిరి కూడా ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోయానని తెలిపాడు. డార్లింగ్ అలా పట్టుకోవడం వల్లే ప్రాణాలతో ఉన్నానన్నాడు. లేదంటే ఆ రోజే చనిపోయేవాడనని చెప్పాడు శేఖర్.

Next Story

Most Viewed