- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుల్ స్టాప్ పెట్టాలని.. డీజీపీకి చంద్రబాబు లేఖ
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. కేసుల విషయమై ఆ లేఖలో ప్రస్తావించారు. లేఖలో పేర్కొన్న అంశాలేంటంటే.. ‘మా నాయకులు(టీడీపీ నాయుకులు)పై తప్పుడు కేసులు పెడుతున్నారు. అయ్యన్నపాత్రుడిపై కూడా కక్ష పూరితంగా కేసు నమోదు చేశారు. డాక్టర్లు సుధాకర్, అనితారాణిల వ్యవహారంలో పోలీసుల తీరు ప్రజలు గమనించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం ప్రజలపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుంటే కొందరు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. కేసుల విషయమై ఆ లేఖలో ప్రస్తావించారు. లేఖలో పేర్కొన్న అంశాలేంటంటే.. ‘మా నాయకులు(టీడీపీ నాయుకులు)పై తప్పుడు కేసులు పెడుతున్నారు. అయ్యన్నపాత్రుడిపై కూడా కక్ష పూరితంగా కేసు నమోదు చేశారు. డాక్టర్లు సుధాకర్, అనితారాణిల వ్యవహారంలో పోలీసుల తీరు ప్రజలు గమనించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం ప్రజలపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుంటే కొందరు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసు వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత ఆ విభాగాధిపతిగా డీజీపీ పైనే ఉంది. నియంతృత రాజకీయాలకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టాలి’ అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
Next Story






