జీవోలను భోగి మంటల్లో తగలబెట్టాలి: చంద్రబాబు

121

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో తగలబెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మంగళవారం టీడీపీ ప్రాంతీయ, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, సమన్వయ కర్తలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలకు వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ గ్రామ స్వరాజ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందన్న చంద్రబాబు.. తిరుపతి బైపోల్, స్థానిక సంస్థల ఎలక్షన్‌లో వైసీపీ ఓటమే టార్గెట్‌గా పనిచేయాలని నేతలకు సూచించారు.

సీఎం జగన్ రైతు వ్యతిరేకిగా మారారని, ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలతో ఏడాదిన్నర కాలంలో 1,779మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు 55శాతం పెరిగాయని, 400 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. 30వేల రైతు కుటుంబాలను రోడ్డుకీడ్చి, టీడీపీ హయాంలో తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలను రద్దు చేశారని ధ్వజం ఎత్తారు.