- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోదీ మాట వినండి..చంద్రబాబు పిలుపు
<p>దేశవ్యాప్తంగా కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాల్సి బాధ్యతను వివరించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధాని సూచించిన జాగ్రత్తలను పాటించాలని తన ఫేస్ బుక్ ద్వారా కోరారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని ప్రసంగించిన వీడియోను పోస్టు చేస్తూ.. భారత్‌లో కరోనా పెరిగిపోతోన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రతికూల పరిస్థితులను ప్రధాని మోదీ చాలా స్పష్టంగా తెలిపారన్నారు. కరోనా […]</p>

దేశవ్యాప్తంగా కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాల్సి బాధ్యతను వివరించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధాని సూచించిన జాగ్రత్తలను పాటించాలని తన ఫేస్ బుక్ ద్వారా కోరారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని ప్రసంగించిన వీడియోను పోస్టు చేస్తూ.. భారత్‌లో కరోనా పెరిగిపోతోన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రతికూల పరిస్థితులను ప్రధాని మోదీ చాలా స్పష్టంగా తెలిపారన్నారు. కరోనా వ్యాప్తి వల్ల దేశం పరీక్ష ఎదుర్కొంటోన్న సమయమని, దీనిపై అంతా కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల రక్షణ కోసం ప్రధాని మోదీ ఇచ్చిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని నేను కోరుతున్నానని ఆయన సూచించారు. కరోనాపై టీడీపీ శ్రేణులతో పాటు, ప్రజంతా కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags: pm narendra modi, tdp, chandrababu naidu, facebook






