- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ 1500 మందిని ఆదుకోండంటూ బాబు లేఖలు
<p>అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖలు రాశారు. ఉత్తరాంద్రతో పాటు ప్రకాశం జిల్లాలకు చెందిన సుమారు 1500 మంది భవన నిర్మాణ కార్మికులు తమిళనాడులో చిక్కుకుపోయారని అన్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో వారికి నిత్యావసరాలు, జీవన భృతి అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లేఖల్లో కోరారు. వారి […]</p>

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖలు రాశారు. ఉత్తరాంద్రతో పాటు ప్రకాశం జిల్లాలకు చెందిన సుమారు 1500 మంది భవన నిర్మాణ కార్మికులు తమిళనాడులో చిక్కుకుపోయారని అన్నారు.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో వారికి నిత్యావసరాలు, జీవన భృతి అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లేఖల్లో కోరారు. వారి యోగ క్షేమాల గురించి వారి కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని ఆయన తెలిపారు. వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించేందుకు వీలుగా వారి ప్రతినిధుల ఫోన్ నెంబర్లను లేఖలకు జతపరిచారు. కాగా, బాబు గతంలో గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రుల గురించి కూడా లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
Tags: tdp, chandrababu naidu, letters, tamil nadu, central home secretary, palaniswamy, ajay kumar bhalla,






