నన్నెందుకు ఓడించారో నాకే తెలియదు: చంద్రబాబు

182

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు తనను ఎందుకు ఓడించారో.. తనకే తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి చేయడమే తన తప్పుయితే క్షమించాలంటూ ప్రజలను వేడుకున్నారు. కృష్ణా జిల్లా పరిటాలలో చంద్రబాబు నివాసం వద్ద రైతులతో కలిసి బోగి మంటలు వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ జీవోలను ఆయన బోగి మంటల్లో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 40 ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చిన్న తప్పుచేయలేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క గుడిపై కూడా దాడి జరగలేదన్న చంద్రబాబు… వైసీపీ హయాంలో 150 ఆలయాలపై దాడులు జరగడం దారుణమన్నారు. ఇక బోర్లకు మీటర్లు పెట్టే బదులు.. వైసీపీ ఎమ్మెల్యేలకు మీటర్లు పెడితే ఎవరు ఎంత కొట్టేశారో తెలుస్తోందని చురకలు వేశారు.