అన్నదాత సుఖీభవే రైతు భరోసా: చంద్రబాబు

by Anukaran |
అన్నదాత సుఖీభవే రైతు భరోసా: చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ, బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టును ఖండించారు. పేదల కోసం తమ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఇవ్వాలని కోరడమే తమ పార్టీ నేతలు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను మానుకుని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. తమ పార్టీ నేతలు ప్రజల కోసం పోరాడుతున్నారని అన్నారు. అనంతరం రైతు భరోసాపై ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొత్తది కాదని వెల్లడించారు. రైతు భరోసాతో ఐదేళ్లలో రైతులకు కేవలం 37,500 రూపాయల లబ్దిమాత్రమే చేకూరుతుందని ఆయన వెల్లడించారు. అదే తమ ప్రభుత్వం ఐతే ఐదేళ్లలో లక్షా 20 వేల రూపాయల లబ్ది చేకూరేదని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed