- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిన్న వాళ్లు షో చేశారు: చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మొదటిసారి అంబులెన్సులు తెచ్చినట్లు నిన్న(బుధవారం) వైసీపీ నేతలు షో చేశారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 108 నిర్వహణ ప్రాజెక్టు అప్పగింతలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. మా హయాంలో 1,800 అంబులెన్సులు, మహాప్రస్తానం, తల్లీబిడ్డా ఎక్స్ ప్రెస్ లు తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా కాలంలో కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని మేం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మొదటిసారి అంబులెన్సులు తెచ్చినట్లు నిన్న(బుధవారం) వైసీపీ నేతలు షో చేశారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 108 నిర్వహణ ప్రాజెక్టు అప్పగింతలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. మా హయాంలో 1,800 అంబులెన్సులు, మహాప్రస్తానం, తల్లీబిడ్డా ఎక్స్ ప్రెస్ లు తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా కాలంలో కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని మేం ప్రభుత్వాన్ని కోరామని, కానీ, ప్రభుత్వం మా విజ్ఞప్తిని పట్టించుకోలేదంటూ ఆయన ఫైరయ్యారు. కేంద్రం నుంచి రూ. 8 వేల కోట్లు ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారని, కేంద్రమంత్రి విద్యుత్ పై మాట్లాడితే ఆమె పైనా కూడా మాటల దాడికి దిగారని చంద్రబాబు ఆరోపించారు.
Next Story






