పోలీసులపై చంద్రబాబు ఫైర్… టీడీపీ నేతల ఆందోళన

by  |
పోలీసులపై చంద్రబాబు ఫైర్… టీడీపీ నేతల ఆందోళన
X

దిశ వెబ్ డెస్క్: రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును కొవిడ్ నిబంధనలతో పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన చంద్రబాబు విమానాశ్రయంలోనే ఉండిపోయాడు. రేణిగుంట పోలీసులు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశాలున్నాయని అందుచేత పర్యాటనకు అనుమతించమని చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. దీనితో బాబు కలెక్టర్ని, ఎస్పీని, ప్రజలను కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను కలవనీయకుండా అడ్డుకోవడం సరికాదని, భయపెట్టి ఎన్ని రోజులు పాలన సాగిస్తారని జగన్ ప్రభుత్వం పై మండి పడ్డాడు. మమ్ముల్ని ఎవరూ ఆపలేరని , మానోళ్లు నొక్కలేరు , ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా మేము ప్రజలని చేరుతామని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. పోలీసు చర్యలతో తన సంకల్పాన్ని అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ సంఘటన పై టీడీపీ నేతలు పోలీసుల చర్యలతో చంద్రబాబును అడ్డుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డురాని కరోనా చంద్రబాబు పర్యటనకు ఎలా అడ్డొచ్చిందని నిలదీశారు. తుగ్లక్ పాలనపై ప్రజలు తిరగబడతారనే విమానాశ్రయంలో తమ అధినేతను నిర్బంధించారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి భయం జగన్‌ను ఇంకా వెంటాడుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబును ఎదుర్కొలేక రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును ముట్టడించారన్నారు. చంద్రబాబు అరెస్టు పై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, కాలవ శ్రీనివాసులు, గద్దె రామ్మోహన్, అమర్నాథ్ రెడ్డి, బండారు సత్యనారాయణ మూర్తి, బీటీ నాయుడు, జవహర్, పీతల సుజాత తదితరులు ట్విట్టర్ ద్వారా ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed