- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవినేని ఉమా దాడి వెనుక చంద్రబాబు : ఎంపీ నందిగం సురేశ్
<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమా దళితులపై దాడికి పాల్పడిన ఘటన వెనుక చంద్రబాబు ఉన్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. గొల్లపూడిలో దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడంపై మండిపడ్డారు. దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆరోపించారు. చంద్రబాబు దళితద్రోహి అని మరోసారి రుజువైందన్నారు. దళితులపై దాడి జరిగితే..గాయపడిన వారిని పరామర్శించకుండా దాడి చేసిన ఉమా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమా దళితులపై దాడికి పాల్పడిన ఘటన వెనుక చంద్రబాబు ఉన్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. గొల్లపూడిలో దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడంపై మండిపడ్డారు.
దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆరోపించారు. చంద్రబాబు దళితద్రోహి అని మరోసారి రుజువైందన్నారు. దళితులపై దాడి జరిగితే..గాయపడిన వారిని పరామర్శించకుండా దాడి చేసిన ఉమా కుటుంబాన్ని పరామర్శించడం దుర్మార్గమన్నారు. గత ఎన్నికల్లో టీడీపీని దళితులు ఓడించడంతో వారిని చంద్రబాబు ఓ పాములా పగబట్టి వేధిస్తున్నారని ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు.
Next Story






