- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు: చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసిన, దాడులు చేసినా టీడీపీ కార్యకర్తలు అవినీతీపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. బలవంతంగా నామినేషన్లకు శ్రీకారం చుట్టారన్నారు. పోలీసులను అడ్డుగా పెట్టుకొని.. బైండోవర్ కేసులు పెడుతున్నారని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసిన, దాడులు చేసినా టీడీపీ కార్యకర్తలు అవినీతీపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. బలవంతంగా నామినేషన్లకు శ్రీకారం చుట్టారన్నారు. పోలీసులను అడ్డుగా పెట్టుకొని.. బైండోవర్ కేసులు పెడుతున్నారని చెప్పారు. బెదిరింపులు, కేసులు పెట్టినా.. టీడీపీ పోరాడి.. ప్రజల మధ్యకు వచ్చారని కొనియాడారు. నాయకులను ప్రజలు ఎన్నుకునే హక్కులో వైసీపీ నేతల దౌర్జన్యం ఏంటని చివరకు ప్రజలు కూడా ప్రశ్నించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Next Story






