ఆ రెండు పార్టీల పతనం ఖాయం: చల్లా వంశీచంద్ రెడ్డి

70

దిశ, వెల్దండ: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ప్రభుత్వాలు రాబోయే కాలంలో పతనం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. గురువారం పోతేపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మంగమ్మ సత్యనారాయణ, నాయకులు భీమయ్య, గణపతి, శ్రీరాములు, శ్రీను, వరుణ్‌లతో మరికొందరు చల్లా వంశీచంద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆచరణలో సాధ్యం కానీ హమీలిచ్చి నరేంద్ర మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు ప్రజల సొమ్మును సంపన్నులకు దోచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే కాలంలో పేద, మధ్య తరగతి వర్గాల అభ్యున్నతితో పాటు దేశ సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..