- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరుబయట నిద్రిస్తుండగా పుస్తెలతాడు చోరీ
<p>దిశ, నల్లగొండ: ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కొందరు దుండగులు ఇదే అదునుగా భావించి తమ పనులు చేసుకుంటున్నారు. దీంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడంలేదు అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వేసవిలో హాయిగా ఉంటుందని ఆరుబయట పడుకుంటే ఓ దుండగుడు బంగారు పుస్తెలతాడుని ఎత్తుకెళ్లిన ఘటన బోల్లెపల్లిలో చోటు చేసుకుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలం బోల్లెపల్లి గ్రామానికి చెందిన […]</p>

దిశ, నల్లగొండ: ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కొందరు దుండగులు ఇదే అదునుగా భావించి తమ పనులు చేసుకుంటున్నారు. దీంతో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడంలేదు అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వేసవిలో హాయిగా ఉంటుందని ఆరుబయట పడుకుంటే ఓ దుండగుడు బంగారు పుస్తెలతాడుని ఎత్తుకెళ్లిన ఘటన బోల్లెపల్లిలో చోటు చేసుకుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలం బోల్లెపల్లి గ్రామానికి చెందిన గోర్ల ప్రవళిక ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఆరుబయట నిద్రించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడుని లాక్కెళ్తుండగా… గమనించిన బాధితురాలు కేకలు వేసింది. ఆమె భర్త దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా… అతను పారిపోయాడని తెలిపారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






