- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచిత్ర దొంగలు.. బంగారంతో పాటు అవి కూడా దొంగతనం
<p>దిశ, కామారెడ్డి: సాధారణంగా దొంగలు అందినకాడికి నగదు, బంగారం, ఇతర సామగ్రి ఎత్తుకెళ్తారు. కానీ ఈ దొంగలు మాత్రం కాస్త వెరైటీగా ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదుతో పాటు ఆ ఇంటి వాళ్ళు చదువుకున్న సర్టిఫికెట్లు కూడా ఎత్తుకెళ్లారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని హరిజనవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బాన్సువాడ నారాయణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలు లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి పదిగంటల సమయం […]</p>

దిశ, కామారెడ్డి: సాధారణంగా దొంగలు అందినకాడికి నగదు, బంగారం, ఇతర సామగ్రి ఎత్తుకెళ్తారు. కానీ ఈ దొంగలు మాత్రం కాస్త వెరైటీగా ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదుతో పాటు ఆ ఇంటి వాళ్ళు చదువుకున్న సర్టిఫికెట్లు కూడా ఎత్తుకెళ్లారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని హరిజనవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బాన్సువాడ నారాయణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలు లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి పదిగంటల సమయం వరకు తాము ఇంట్లోనే ఉన్నామని, అమ్మ బాగాలేదని ఫోన్ రావడం ద్వారా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్లడం జరిగిందని తెలిపారు.
ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉందని, ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న తులం బంగారం, పది తులాల వెండి, 3 వేల నగదుతో పాటు నర్సింగ్ ట్రైనింగ్ చేసిన సర్టిఫికెట్, తాను చదువుకున్న సర్టిఫికెట్లు కూడా దొంగతనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Tags
- certificates






