పీఏసీఎస్ చైర్మన్ వేధింపులకు సీఈవో ఆత్మహత్య

270

దిశ, ఇబ్రహీంపట్నం: టీఆర్ఎస్ పార్టీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్ వేధింపులు తట్టుకోలేక సహకార సంఘం బ్యాంక్ సీఈఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఈవో ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారానికి చెందిన రాచకొండ మైలారం సహకార సంఘం బ్యాంకు సీఈఓ మగ్బుల్‌ (ఫరీద్)ను ఆ సంఘం చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా చైర్మన్‌కు సీఈవోకు వివాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా చైర్మన్ వేధింపులు భరించలేక మంగళవారం ఉదయం సీఈఓ మగ్బుల్‌ తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు చైర్మన్ పేరిట సూసైట్ నోట్ రాసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మగ్బుల్‌ ఆత్మహత్యతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయన మృతదేహన్ని సహకార సంఘం బ్యాంకుకు తరలించారు. బ్యాంకు ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, చైర్మన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..