ఎలక్ట్రానిక్ వాహనాలు మాత్రమే వాడాలి.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

by  |
e-cars c
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని మంత్రులు, ముఖ్యమంత్రులకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. ప్రభుత్వ విధానాలను అనుసరించేలా ఇకనుంచి ఎలక్ట్రానిక్ (ఈవీ) వాహనాలను తమ అధికారిక కార్యక్రమాలకు వినియోగించాలని కోరింది. దీనికి సంబంధించి కేంద్ర విద్యుత్, ఇంధన వనరుల శాఖా మంత్రి ఆర్ కే సింగ్ మంత్రులు, ముఖ్యమంత్రులకు లేఖ ద్వారా తెలిపారు. గత కొంతకాలంగా కేంద్రం దేశీయంగా ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది.

అందుకోసం ఫేమ్ పథకాన్ని రూపొందించి, ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచేందుకు ప్రోత్సహకాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం మంచిదని ఆర్ కే సింగ్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా సంబంధిత శాఖల్లో వాడుతున్న సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చాలని, అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రుల వాహనాల్లో కాన్వాయ్ కోసం ఐదు నుంచి పది వాహనాలను వినియోగిస్తారు. వీటిని ఎలక్త్రిక్ వాహనాలకు మార్చడం ద్వారా ప్రచారంతో పాటు కాలుష్యాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


Next Story