సెంట్రల్ విస్టాపై వెంటనే విచారించండి: సుప్రీం

by  |
supreme court
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నదని పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, దీనిపై ఢిల్లీ హైకోర్టు వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది. ముందస్తు విచారణ కోసం ఈ అంశాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించడానికి పిటిషనర్‌కు అనుమతినిచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ విస్టా పనులను నిలిపేయాలని కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్‌నూ రద్దు చేశారని, కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ పనులను నాలుగు నుంచి ఆరు వారాలు వాయిదా వేయాలని పిటిషన్ పేర్కొంది.


Next Story

Most Viewed