దేశానికి హాని చేయాలని చూస్తే.. సహించేది లేదు

8

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్ముతోందని అన్నారు. దేశానికి ఎవరైనా హాని చేయాలని చూస్తే.. సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో ఎన్ఎస్‌జీ బలగాల పాత్ర ఎంతో కీలకం అన్నారు. ఉద్రవాద నిరోధక చర్యలు, ముఖ్యుల భద్రతలో ఎన్ఎస్‌జీ విశిష్ట సేవలు అందిస్తోందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఉత్తమ బలగాల్లో ఎన్ఎస్‌జీ ఒకటిగా నిలిచిందని అన్నారు. దేశంలోని కౌంటర్ టెర్రరిస్ట్ బలగాలకు ఎన్‌ఎస్‌జీ శిక్షణ ఇస్తోందని తెలిపారు.