- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మాతృ వియోగం
by Batti.Sumithra |
<p>న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తల్లి బిమల ప్రసాద్ గురువారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కేంద్ర మంత్రి స్వయంగా ఇవాళ వెల్లడించారు. తాను సాధించిన విజయాలకు ఆమె ఆశీర్వాద బలమే కారణమని, చిన్నప్పటి నుంచి తల్లి నుంచే ప్రేరణ పొందారని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరారు. దివంగత నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి, దీన్‌దయాల్, నానాజీ దేశ్‌ముఖ్‌లు పాట్నాకు వచ్చిన […]</p>

X
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తల్లి బిమల ప్రసాద్ గురువారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కేంద్ర మంత్రి స్వయంగా ఇవాళ వెల్లడించారు. తాను సాధించిన విజయాలకు ఆమె ఆశీర్వాద బలమే కారణమని, చిన్నప్పటి నుంచి తల్లి నుంచే ప్రేరణ పొందారని పేర్కొన్నారు.
ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరారు. దివంగత నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి, దీన్‌దయాల్, నానాజీ దేశ్‌ముఖ్‌లు పాట్నాకు వచ్చిన ప్రతిసారి తన తల్లి బిమల ప్రసాద్ వంటలు ఆస్వాదించేవారని గుర్తుచేసుకున్నారు. జేపీ ఉద్యమంలో ఆమె చురుకుగా పాల్గొన్నారని, తొలి నుంచీ పార్టీలో సేవలందించారని పేర్కొన్నారు. జనతాపార్టీ ప్రభుత్వంలో రవిశంకర్ ప్రసాద్ తండ్రి ఠాకూర్ ప్రసాద్ మంత్రిగా సేవలందించారు.
Next Story






