మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్..

76

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 2లక్షలకు పైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. సెకండ్ వేవ్ ప్రతీ ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆస్పతుల్లో బెడ్స్ సరిపోవడం లేదంటే కరోనా ఉధృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పుకొచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..