- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యాటక రంగం పునరుజ్జీవనానికి కృషి: కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక రంగం పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బేగంపేటలోని ప్లాజీ సంగమం హాల్ లో టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దక్షిణ ప్రాంత రిజిస్టర్డ్ టూర్ గైడ్‌లు, ఆపరేటర్‌లకు ఎల్ జీఎస్ సీఏ టీఎస్ఎస్ కింద ఆర్థిక సహాయ చెక్కులు, మంజూరీ లేఖలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక రంగం పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బేగంపేటలోని ప్లాజీ సంగమం హాల్ లో టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దక్షిణ ప్రాంత రిజిస్టర్డ్ టూర్ గైడ్‌లు, ఆపరేటర్‌లకు ఎల్ జీఎస్ సీఏ టీఎస్ఎస్ కింద ఆర్థిక సహాయ చెక్కులు, మంజూరీ లేఖలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయిన పర్యాటక రంగం బలోపేతానికి చర్యలు తీసుకోకున్నట్లు వెల్లడించారు. యాత్రికులకు సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(టీటీఏటీ) వ్యవస్థాపకుడు కె. శ్రీనివాస్ రావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Next Story






