కైట్ ఫెస్టివల్‌‌‌కు కేంద్రమంత్రి

32

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం ఉదయం హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్‌లో కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం చిన్నారులతో కలిసి ఆయన గాలిపటాలు ఎగురవేయనున్నారని సమాచారం. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.