గోదావరి నుంచి 247 టీఎంసీలు తరలిస్తాం.. కేంద్రం వెల్లడి

247
Godavari

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి–కావేరి లింక్​ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్​ను ఏప్రిల్​లోనే రాష్ట్రాలకు పంపించామని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేష్వర్​ తుడు వెల్లడించారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై సోమవారం వివరణ ఇచ్చారు. గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీలను తరలించేందుకు ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా బేసిన్​ మీదుగా ఈ నీటిని తరలిస్తామని, మూడు లింకులుంటాయని వివరించారు. గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి మొదలవుతుందని, నాగార్జున సాగర్​ (కృష్ణా), సోమశిల (పెన్నా) నుంచి కావేరి (గ్రాండ్​ అనికట్​) వరకు తరలిస్తామన్నారు. తమిళనాడుకు సాగు, తాగునీటి అవసరాల కోసం 200 టీఎంసీలు కావాలని కోరిందని, అయితే దీనిపై పూర్తిస్థాయి డీపీఆర్​ను రూపొందించి, రాష్ట్రాలకు పంపించామన్నారు. కానీ రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి రిప్లై రాలేదని బిశ్వేష్వర్​ తుడు రాజ్యసభలో చెప్పారు. ఈ గోదావరి–కావేరీ లింక్​ ప్రాజెక్టుకు ఇంకా నిధుల కేటాయింపు చేయలేదన్నారు.