- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో సెంట్రల్ జైలు ఖైదీ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. సామాన్య జనాలకే కాకుండా, జైల్లలో ఉన్న ఖైదీలకు కూడా సోకుతూ, భయబ్రాంతులకు గురిచేస్తోంది. కడప జిల్లాలో మొన్న మొన్న 755 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క జిల్లా సెంట్రల్ జైల్‌లోనే 317 కేసులు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా రేపింది. మొత్తం 700 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 317 మందికి పాజిటివ్‌గా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. సామాన్య జనాలకే కాకుండా, జైల్లలో ఉన్న ఖైదీలకు కూడా సోకుతూ, భయబ్రాంతులకు గురిచేస్తోంది. కడప జిల్లాలో మొన్న మొన్న 755 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క జిల్లా సెంట్రల్ జైల్‌లోనే 317 కేసులు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా రేపింది.
మొత్తం 700 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 317 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వీరందరినీ జైల్లోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్టు జైలు అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే తాజాగా సెంట్రల్ జైల్లో కరోనాతో లింగన్న( 56) అనే ఖైదీ మృతిచెందాడు. ఇది కడప కారాగారంలొ తొలి మరణంగా చెబుతున్నారు. మృతుడుది కర్నూలు జిల్లాగా గుర్తించారు.
Next Story






