60 శాతం కొవిడ్ మరణాలు.. ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది: లవ్ అగర్వాల్

113

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ దేశంలో కొవిడ్ పరిస్థితులపై మీడియాతో సంభాషించారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాతే దేశంలో కొవిడ్ పరిస్థితి అదుపు తప్పిందన్నారు.

సెకండ్ వేవ్ ఉధృతి తీవ్ర రూపం దాల్చిందన్నారు. కరోనా మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవడం జరిగిందన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 60శాతం కరోనా మరణాలు నమోదవుతున్నాయని వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..