లవ్ అగర్వాల్‌కు పాజిటివ్..

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సాధారణ పౌరుల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కరోనా వారియర్లు ఇలా ఎవరినీ వదలకుండా తన గుప్పిట్లో బంధిస్తోంది కరోనా. ఈ నేపథ్యంలోనే దేశంలో పాజటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే, పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడగా, తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్‌‌కు పాజిటివ్‌ నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నాకు [&hellip;]</p>

లవ్ అగర్వాల్‌కు పాజిటివ్..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సాధారణ పౌరుల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కరోనా వారియర్లు ఇలా ఎవరినీ వదలకుండా తన గుప్పిట్లో బంధిస్తోంది కరోనా. ఈ నేపథ్యంలోనే దేశంలో పాజటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే, పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడగా, తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్‌‌కు పాజిటివ్‌ నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌‌లో ఉన్నాను. నాతో కలిసి పనిచేసిన అధికారులు, సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోవాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి’ అంటూ లవ్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

Next Story