- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర నిర్ణయం..సేఫ్ సిటీగా హైదరాబాద్
<p>దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఎంపిక చేసింది. అందుకు అనుగుణంగా నగరంలోని జంక్షన్లు, ప్రధాన రోడ్లపై సీసీ కెమెరాల ఏర్పాటును పూర్తిచేసేలా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, సీఆర్‌ఎంపీ ఏజెన్సీలు,సీసీ టీవీలు ఏర్పాటు చేస్తున్నఎల్‌అండ్‌టీ, జియో సంస్థల ప్రతినిధులతో బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..సీసీ కెమెరాల […]</p>
దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఎంపిక చేసింది. అందుకు అనుగుణంగా నగరంలోని జంక్షన్లు, ప్రధాన రోడ్లపై సీసీ కెమెరాల ఏర్పాటును పూర్తిచేసేలా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, సీఆర్‌ఎంపీ ఏజెన్సీలు,సీసీ టీవీలు ఏర్పాటు చేస్తున్నఎల్‌అండ్‌టీ, జియో సంస్థల ప్రతినిధులతో బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..సీసీ కెమెరాల ఏర్పాటుకు రోడ్ కట్టింగ్ జరిగిన 48గంటలలోపే రోడ్డు పునరుద్దరణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌తో పాటు సిఆర్‌ఎంపీ రోడ్ల నిర్వహణను పైలెట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌లో అమలు చేస్తున్నందున పోలీసు,జోనల్ కమిషనర్లు, ఏజెన్సీల మధ్య జోనల్ స్థాయిలో చర్చ జరిపి రోడ్ కట్టింగ్, వాటి పునరుద్దరణ వెంటనే ఉండేలా చూడాలని కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు.
స్మార్ట్ సిటీ కింద జంక్షన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మూడు దశల్లో ఎల్‌అండ్‌టీ సంస్థ రోడ్ కట్టింగ్‌కు అనుమతులకు దరఖాస్తు చేసిన 2662 జంక్షన్లలో 2557 చోట్ల అనుమతులిచ్చినట్టు పేర్కొన్నారు.రోడ్ కట్టింగ్ విస్తీర్ణం 59 కిలోమీటర్లు ఉంటుందన్నారు.అలాగే నెట్‌వర్క్ ఏర్పాటుకు రిలయన్స్ జియో 1077 జంక్షన్లలో మైక్రో కట్టింగ్‌కు అనుమతులు కోరగా మొదటి విడతగా దరఖాస్తు చేసిన 493 చోట్ల దాదాపు 26 మీటర్ల కట్టింగ్‌కు అనుమతి ఇచ్చినిచ్చామన్నారు. రిలయన్స్ జియో ఏజెన్సీ సీసీ కెమెరాల ఏర్పాటుకు 5280 పోల్స్, 221 మీటర్ల పొడవున రోడ్ కట్టింగ్‌కు అనుమతి మంజూరు చేశామని కమిషనర్ వెల్లడించారు.రోడ్ కట్టింగ్ చేసిన చోట శిథిలాల తొలగింపు బాధ్యత ఆయా సంస్థలదేనని ఆయన స్పష్టం చేశారు.
అలాగే ఇంటిగ్రేటెడ్ పార్కింగ్ సిస్టం, డార్క్ స్పాట్‌ల రిపేర్‌లు, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు, జంక్షన్స్‌లో ప్రతి శాఖ తమ అవసరాలకు వేర్వేరు పోల్స్ నిర్మించుకోకుండా అందుబాటులో వాటినే సమిష్టిగా వినియోగించుకోవాలని సూచించారు.వీధి వ్యాపారులకు లొకేషన్ లింక్‌తో గుర్తింపుకార్డుల జారీ తదితర అంశాలపై అధికారులంతా చర్చించారు. ఈ లొకేషన్లలో 533 చోట్ల ఇప్పటికే నెట్‌వర్క్ కనెక్షన్లు ఉంటే, కొత్తగా నెట్‌వర్క్ ఏర్పాటుకు 297 లొకేషన్లలో 5.79 కిలోమీటర్ల పొడవున మైక్రో కట్టింగ్ పనులు పూర్తయ్యాయని బల్దియా అధికారులు తెలిపారు.సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్, సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్, రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్‌బాబు, సైబారబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్‌చౌహాన్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్, జోనల్ కమిషనర్లు ఎన్.రవికిరణ్, వి.మమత, బి.శ్రీనివాస్‌రెడ్డి, సామ్రాట్ అశోక్, ప్రావిణ్య, అదనపు కమిషనర్లు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.






