ఫాస్టాగ్ డెడ్‌లైన్ పొడిగింపు

by  |
ఫాస్టాగ్ డెడ్‌లైన్ పొడిగింపు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఫాస్టాగ్ డెడ్‌లైన్‌ను పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా 2017 డిసెంబర్ 1వరకు కొనుగోలు చేసిన గూడ్స్ అండ్ రవాణా వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని సూచించారు. ఫాస్టాగ్ గడువును గతేడాది అక్టోబర్ వరకు నిర్ధారించామని, అయినా కొన్ని వాహనాలు ఫాస్టాగ్ చేయించుకోలేదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం పలు కారణాలతో 2021 జనవరి 1 నాటికి ఫాస్టాగ్ గడువు పొడగించామని, నిబంధనల ప్రకారం 2017 డిసెంబర్ వరకు అమ్మిన, కొనుగోలు చేసిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్ తప్పనిసరి ఉండాలంటూ సూచించారు. అంతేకాకుండా వాహన చట్టం ప్రకారం ఫాం 4ఏలో ఇన్సూరెన్స్ పత్రాల్లో ఫాస్టాగ్ ఐడీ పొందుపర్చాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Next Story

Most Viewed