‘ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు’

by  |
‘ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు’
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2019-20లో ప్రకటనల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించింది. రూ. 713.20 కోట్లను ఎలక్ట్రానిక్, ప్రింట్, ఔట్‌డోర్ మీడియాలో ప్రకటనల కోసం చెల్లించింది. అంటే రోజుకు సుమారుగా రెండు కోట్ల మేర యాడ్స్‌కు ఖర్చుపెట్టింది. ఈ మొత్తంలో సింహభాగం ఎలక్ట్రానిక్ మీడియాకే చెల్లించడం గమనార్హం. ముంబయికి చెందిన జతిన్ దేశాయ్ దాఖలు చేసిన ఆర్టీఐకి వచ్చిన సమాధానంలో ఈ మేరకు వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019-20 ఆర్థిక సంవత్సర కాలంలో కేంద్రం ప్రకటనల కోసం ఈ మొత్తాన్ని ఖర్చుచేసినట్టు బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ కోసం రూ. 317.05 కోట్లను వెచ్చించగా, ప్రింట్ మీడియాకు రూ. 295.05, ఔట్‌డోర్ మీడియాకు రూ. 101.10 కోట్లను చెల్లించింది. అయితే, విదేశీ మీడియాలో ప్రకటనల కోసం కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి సమాచారం లేదని కార్యకర్త జతిన్ దేశాయ్ వివరించారు. అలాగే, కేంద్రం విడుదల చేసిన ప్రకటనల వివరాలపైనా స్పష్టత లేదని తెలిపారు.


Next Story

Most Viewed