ఒమిక్రాన్ డేంజర్.. రాష్ట్రాలకు కేంద్ర ప్రత్యేక బృందాలు

by  |
Omicron
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కేసులు పెరుగుతున్న రాష్ట్రాలపై కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దేశంలో కేసులు అధికంగా ఉన్న, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగని పది రాష్ట్రాలను గుర్తించారు.

ఈ రాష్ట్రాలకు కేంద్ర అత్యున్నత స్థాయి బృందాలను పంపించనున్నారు. ఈ క్రమంలో దేశంలోని కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బీహార్, ఉత్తర్​ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్​రాష్ట్రాలపై ఫోకస్ చేయనున్నారు. ఈ రాష్ట్రాల్లో కరోనా నిబంధనల అమలు, హాస్పిటల్స్‌లో బెడ్స్, అంబులెన్స్‌లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌తో పాటు వ్యాక్సినేషన్​ప్రక్రియను వేగం చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అయితే, ఈ బృందాలు రాష్ట్రంలో మూడు నుంచి ఐదు రోజులు పర్యటించనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.


Next Story