ప్రత్యేక హోదా ఇవ్వలేం.. మరోసారి తేల్చిచెప్పిన కేంద్రం

by  |

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని మరోసారి కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. పార్లమెంట్‌లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానంద్‌రాయ్ సమాధానమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదని ఆయన పార్లమెంట్ వేదికగా మరోసారి సూటిగా చెప్పారు.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని నిత్యానంద్రాయ్ చెప్పారు. ‘తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కారం మా చేతుల్లో లేదు. తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి’ అని నిత్యానంద్‌రాయ్ లోక్‌సభలో పేర్కొన్నారు.

మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అవకాశముందన్నారు. విభజన హామీల అమలు వివిశ శాఖలతో సమీక్ష చేస్తున్నామని, విభజన చట్టం అమలు పురోగతిని హోంశాఖ సమీక్షిస్తోందన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story