వ్యాక్సిన్‌పై కేంద్రం కీలక ప్రకటన..

by  |
వ్యాక్సిన్‌పై కేంద్రం కీలక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఫార్ములాను వేరే కంపెనీలకు ఇచ్చేందుకు భారత్ బయోటక్ సంస్థ ఒప్పుకున్నట్టు సమాచారం.

భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సిద్దంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా విదేశీ వ్యాక్సిన్ల దిగుమతికి కేంద్రం అనుమతినిచ్చింది. విదేశీ వ్యాక్సిన్ల దిగుమతిపై మరో ఒకటి, రెండు రోజుల్లోనే అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ సంస్థలు విదేశాంగశాఖను సంప్రదించినట్టు కేంద్రం పేర్కొంది.


Next Story