ఆ సెల్ నెట్ వర్క్‌తో నానా కష్టాలు.. ఆ ఊరి ప్రజల తిప్పలు తప్పేదెలా

by  |

దిశ, గుండాల : గుండాల అల్లపల్లి మండలాల్లో బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, మండల వ్యాప్తంగా ఉన్న నెట్ వర్క్ సక్రమంగా పని చేయక సెల్ ఫోన్ వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ అయితే చెప్పనవసరం లేదు మండల వ్యాప్తంగా టవర్స్ ఉన్నా ఉపయోగం లేదు. ఒకటి రెండు టవర్లు మినహా అధికశాతం బిఎస్ఎన్ఎల్ టవర్స్ పనిచేయడం లేదు. దీంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రోజు ఎయిర్టెల్ నెట్ వర్క్ ఉదయం నుంచి సాయంత్రం వరకు సక్రమంగా పనిచేయకపోవడంతో నెట్ వర్క్ ప్రాబ్లంతో అధికారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఇకనైనా అధికారులు చొరవ తీసుకొని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ నెవర్క్‌లు సక్రమంగా పనిచేసే విధంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story