- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోశయ్యకు ప్రముఖుల నివాళులు.. కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : నేడు మహా ప్రస్థానంలో మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. శనివారం ఉదయం రోశయ్య అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమీర్‌పేటలోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం నుంచి పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు విచ్చేసి నివాళులు అర్పిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు రోశయ్యలేని లోటు తీర్చలేనిదని అన్నారు. అసెంబ్లీలో రాజకీయంగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నేడు మహా ప్రస్థానంలో మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. శనివారం ఉదయం రోశయ్య అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమీర్‌పేటలోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం నుంచి పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు విచ్చేసి నివాళులు అర్పిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు రోశయ్యలేని లోటు తీర్చలేనిదని అన్నారు. అసెంబ్లీలో రాజకీయంగా ఘర్షణ పడినంత మాత్రాన తాము శత్రువులం కాదని కామెంట్స్ చేశారు.
ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జునరెడ్డి విచ్చేశారు. రోశయ్య పార్థివదేహం వద్ద అంజలి ఘటించి నివాళులు అర్పించారు.
Next Story






