సెలెబ్రేటింగ్ తెలుగు సినిమా..#SBSB

by  |
సెలెబ్రేటింగ్ తెలుగు సినిమా..#SBSB
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్టర్ ఎ గ్యాప్.. సినిమా ఈజ్ బ్యాక్. దాదాపు ఎనిమిది నెలల తర్వాత థియేటర్‌లో సినిమా ఎక్స్‌పీరియన్స్‌కు సిద్ధం అయ్యారు తెలుగు ప్రేక్షకులు. బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నట్లుగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కరోనా తర్వాత ఫస్ట్ తన మూవీనే రిలీజ్ చేయబోతున్నారు. లాక్ డౌన్ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ పెద్ద సాహసమే చేసినా..ఆ సాహసం సక్సెస్ అయిందనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా, దాదాపు వారం రోజుల వరకు టికెట్లు ఆల్రెడీ బుక్ అయ్యాయి. కేవలం ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ యూనిట్ మాత్రమే కాదు. ఇండస్ట్రీ మొత్తం కూడా సినిమా కోసం డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ప్రమోషన్ చేస్తూ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి లభించే ఆదరణే నెక్స్ట్ సినిమాల రిలీజ్ ఆధారపడి ఉండగా.. తేజ్ సినిమాకు అన్ని వైపుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ తమ తోటి కథానాయకుడికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేస్తున్నారు. తమ ఫ్యాన్స్ కూడా సినిమా చూడాలని ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటిలాగే హిట్ల మీద హిట్లతో ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడాలని కోరుకుంటూ #SBSB టీంకు విష్ చేస్తున్నారు.

#సెలబ్రేటింగ్ సినిమా.. #రిటర్నింగ్ ఆఫ్ తెలుగు సినిమా.. #బిగ్ స్క్రీన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.. ట్యా్గ్ ఏదైనా సరే అందరూ కోరుకునేది తెలుగు సినిమా కలకాలం హిట్స్‌తో సాగుతూనే ఉండిపోవాలని.. కళాకారులు, కార్మికులు చేతినిండా పనితో ఉండాలని. అందుకే ఇండస్ట్రీ ఏకం అయింది. తెలుగు సినిమాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఫస్ట్ రిలీజ్ కాబోతున్న సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాకు వంద శాతం మద్దతిస్తోంది.

ఫైనల్లీ.. ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో రెడీ : విజయ్ దేవరకొండ
హౌజ్ ఫుల్ అయిందిరా.. టికెట్లు లేవంట అనే పదాలు విని చాలా కాలం అయింది కదా. ఫైనల్‌గా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.. బాయ్స్ గ్యాంగ్‌తో థియేటర్‌కు వెళ్లేందుకు రెడీ అయిపోయానని చెప్తున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. సోలో బ్రతుకే సో బెటర్ టీంకు సూపర్ డూపర్ విషెస్ అందించిన విజయ్.. తేజ్ సినిమా అందరి మొహాల్లో చిరునవ్వు తీసుకొస్తుందన్నాడు. ఈ టైంలో ఇది చాలా అవసరం కూడా అన్న విజయ్.. రామ్ పోతినేని రెడ్, మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు.

నా టికెట్స్ బుక్ అయ్యాయోచ్ : రామ్ పోతినేని

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కోసం ఎగ్జైటింగ్ ఉన్నట్లు తెలుపుతూ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని. టికెట్స్ బుక్డ్ అంటూ ట్వీట్ చేసిన రామ్.. హీరో సాయి ధరమ్ తేజ్, తన చాందిని నభా నటేష్, నిర్మాతకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. డైరెక్టర్ సుబ్బు కుమ్మేయి అంతే..అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాడు. ఈ సినిమా స్ఫూర్తితో సంక్రాంతి కానుకగా బిగ్ స్క్రీన్‌పై సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.

మైల్ స్టోన్‌గా తేజ్ సినిమా: మహేశ్ బాబు

సోలో బ్రతుకే సో బెటర్‌ టీంకు బెస్ట్ విషెస్ అందించారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కరోనా టైంలో బిగ్ స్క్రీన్‌ను టచ్ చేస్తున్న సినిమా మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందన్నారు. ప్రేక్షకుల ఆదరణతో తప్పకుండా విజయం సాధిస్తుందని.. హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ నభా నటేష్, డైరెక్టర్ సుబ్బు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్, నిర్మాతకు కంగ్రాట్స్ చెప్పారు.

https://twitter.com/urstrulyMahesh/status/1342026527198736385?s=20

కఠిన సమయాల్లో ముందుకు: అఖిల్

కఠిన సమయాల్లో ముందుకు సాగుతున్న సోలో బ్రతుకే సో బెటర్ మూవీ యూనిట్ సినీ ఇండస్ట్రీకి ఆదర్శంగా నిలుస్తుందన్నారు అఖిల్ అక్కినేని. పాజిటివ్ వైబ్రేషన్స్‌, సూపర్ పవర్ మీతో ఉంటుందన్న అఖిల్.. ఆల్ ది బెస్ట్ చెప్పారు.

https://twitter.com/AkhilAkkineni8/status/1342069504226934785?s=20



Next Story

Most Viewed