కల్వకుంట్ల కవితపై సిడీ ఆవిష్కరణ

by  |

దిశ, హైదరాబాద్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత జన్మదినం సందర్భంగా ప్రముఖ కవి నరాల సుధాకర్ రచించిన సిడీని తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు నందిన సిధారెడ్డి బుధవారం ఆవిష్కరించారు. రవీంద్ర భారతీ లో బుధవారం నిర్వహించిన కవిత జన్మదినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లడారు. తెలంగాణ సంప్రదాయాలను ఉద్యమ రూపంలో తీసుకొచ్చి చైతన్య పరిచిన నాయకురాలు కల్వకుంట్ల కవిత అని, పార్లమెంటు సభ్యురాలిగా తెలంగాణ వాణిని బలంగా వినిపించిన ప్రజా నాయకురాలు అని కొనియాడారు. కవిత జన్మదినం సందర్భంగా రూపొందించిన సిడి బాగుందని నరాల సుధాకర్ ను అభినందించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రాజీవ్ సాగర్, ఘనపురం దేవేందర్, కొయ్యడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: kalvakuntla kavitha birthday, ravindra bharathi , release cd, famous poet sudhakar, nandini sidha reddy

Next Story

Most Viewed